27.1 C
Hyderabad

పాముకాటుతో బాలిక మృతి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ:  బాన్సువాడ మండలం పులిగుండు తండా పంచాయతీ పరిధిలో కాలు నాయక్ తండాలో విషాదం నెలకొంది. తండాలో ఓ బాలిక పాము కాటుకు గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..  తండాకు చెందిన  శ్రీకాంత్ కూతురు చౌహన్ సరస్వతి  బుధవారం ఉదయం వాంతులు చేసుకుంది. ఆందోళకు గురైన తల్లిదండ్రులు సరస్వతిని పరిశీలించడంతో కుడికాలిపై పాముకాటు గుర్తులను గమనించారు.  వెంటనే కుటుంబ సభ్యులు బాలికను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ జీజీహెచ్​కు రిఫర్ చేశారు. మార్గమధ్యలో దుర్కి వద్ద బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి చౌహాన్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.

 

 

More articles

Latest article