పాముకాటుతో బాలిక మృతి
బాన్సువాడ, బతుకమ్మ: బాన్సువాడ మండలం పులిగుండు తండా పంచాయతీ పరిధిలో కాలు నాయక్ తండాలో విషాదం నెలకొంది. తండాలో ఓ బాలిక పాము కాటుకు గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన శ్రీకాంత్ కూతురు చౌహన్ సరస్వతి బుధవారం ఉదయం వాంతులు చేసుకుంది. ఆందోళకు గురైన తల్లిదండ్రులు సరస్వతిని పరిశీలించడంతో కుడికాలిపై పాముకాటు గుర్తులను గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. మార్గమధ్యలో దుర్కి వద్ద బాలిక...