27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ తరగతులలో భాగంగా మంగళవారం లయన్స్ క్లబ్ రుద్రూర్ వారి సహకారంతో విద్యార్థులకు లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారిచే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 90 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను రాసి ఇవ్వడం జరిగింది. అదే విధంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు  అందజేశారు. విద్యార్థులకు రాబోయే కాలంలో వారు ఎదగడాని కొరకు మోటివేషన్ క్లాస్ ని నిర్వహించడం జరిగింది. సీనియర్ లయన్స్ సభ్యులు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ యార్లగడ్డ శ్రీనివాస్ మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుండూరు ప్రశాంత్ గౌడ్, లయన్ కె.వి మోహన్, లయన్ సీనియర్ సభ్యులు లయన్ ఇందూర్ చంద్రశేఖర్, లయన్ శ్యామ్ సందర్ పహాడే, ప్రవీణ్ కారంగుల, లయన్ గెంటీల గంగాధర్, లయన్ ప్రశాంత్ పార్వతి, ఇతర లయన్స్ సభ్యులు, లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వైద్యులు అజయ్, కోఆర్డినేటర్ హనుమంతరావు, రఫీ, రైడ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article