25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్యాడి సెంటర్ లలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న తహసిల్దార్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్యాడి సెంటర్లలో రైతులకు ఇబ్బందులు కలిగించద్దు

 

. . . తహాసిల్దార్ బాలయ్య

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి మండలం కేంద్రంలోని వివిధ గ్రామాలలో ప్యాడి సెంటర్లలో తాహసిల్దార్ బాలయ్య ఆకస్మికంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఇన్ చార్జిలకు తెలియజేశారు. లారీల కొరత ఉన్నట్టయితే పై అధికారుల దృష్టికి గాని తమ దృష్టికి గాని తీసుకురావాలని అన్నారు. అలాగే రైతులకు కనీస సౌకర్యాలు కూడా ప్యాడి సెంటర్లలో కల్పించాలని నీరు నీడ కల్పించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్యాడి సెంటర్ల నిర్వాహకులు, ఐకెపి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Tehsildar conducting surprise inspections at paddy centers

More articles

Latest article