28.8 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ జాగృతిలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చేరిక

Must read

📰 Generate e-Paper Clip

  • రాజేశ్ నాయక్ కు కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమకారుడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నంగవత్ రాజేష్ నాయక్ తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన రాజేశ్ నాయక్ జాగృతిలో చేరడం ఆనందంగా ఉందని.. ఉద్యమకారులమంతా కలిసి సామాజిక తెలంగాణ సాధనకు పాటుపడదామని కవిత పిలుపునిచ్చారు. రాజేశ్ నాయక్ స్పందిస్తూ.. కవిత పిలపు మేరకు తెలంగాణ జాగృతిలో చేరానని చెప్పారు.. తెలంగాణ ఉద్యమకారుల పునరేకీకరణ జరగాలని పిలుపునివ్వడంతో జాగృతిలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లకు గురై ఆస్తులు అమ్ముకొని ఉద్యమంలో పని చేశానని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలను ప్రోత్సహిస్తుండటంతోనే బీఆర్ఎస్ ను వీడి తెలంగాణ జాగృతిలో చేరుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు ఇస్మాయిల్, సంపత్ గౌడ్, కోళ్ల శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Former chairman of the library organization joins Telangana Jagruti

More articles

Latest article