తెలంగాణ జాగృతిలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చేరిక
రాజేశ్ నాయక్ కు కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమకారుడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నంగవత్ రాజేష్ నాయక్ తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన రాజేశ్ నాయక్ జాగృతిలో చేరడం ఆనందంగా ఉందని.. ఉద్యమకారులమంతా కలిసి సామాజిక తెలంగాణ సాధనకు పాటుపడదామని కవిత పిలుపునిచ్చారు. రాజేశ్ నాయక్...