నగర పారిశుధ్యంపై దృష్టి పెట్టండి 

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగర పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. నాందేవాడ, హమాల్ వాడి 35,36 డివిజన్లో మంగళవారం ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషన్ కి పలు సూచనలు చేశారు. నగరంలో డ్రైనేజీ సమస్య కీలకంగా మారిందని మున్సిపల్ సిబ్బంది  నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని...