నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఎం.ఏ.ఇంగ్లీష్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..మీరు జీవితంలో తదుపరి పరిశోధన, బోధన, వంటి వృత్తిపరమైన రంగాలలో రాణించాలంటే యూ.జి.సి. నెట్, జే.ఆర్.ఎఫ్. వంటి ఫెలోషిప్స్ సాధిస్తే, భవిష్యత్తు గొప్పగా మార్చుకోవచ్చు అని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం మాట్లాడుతూ..సాహిత్యం అధ్యాయనం చేసిన మీరు సాహిత్య రచనలు చేయాలి, మీ సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. ఆంగ్లవిభాగం అధిపతి, పి.ఆర్.వో. డాక్టర్ దండుస్వామి మాట్లాడుతూ.. మానవత్వం,సానుభూతి,సత్యం వంటి విలువలతో సాహిత్య విద్యార్థులు సమాజాన్ని మార్చాలని, ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడంలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, ఆంగ్లవిభాగం అధ్యాపకులు ఎంతో కృషిచేశారని, గుర్తుచేశారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థులుగా మిమ్మల్ని గొప్పస్థాయిలో చూడాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో పీజీ ప్రవేశ పరీక్షలో ఆంగ్లం సబ్జెక్టులో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన ఏం.గంగోత్రి, ఏ. పూజా, షాగుప్తా, సాయిరాం లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామ్ కిషన్,ఎన్సిసి అధికారి డాక్టర్ రామస్వామి, డాక్టర్ ముతెన్న, చంద్రశేఖర్, రమేష్ గౌడ్, పూర్ణచందరావు, నాగజ్యోతి, ప్రతిభ,దస్తప్ప, లావణ్య, రాజశేఖర్, నికత్ ఫాతిమా, స్థిత ప్రజ్ఞ, సన్నిత్, వసంత్ కుమార్, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

