సిలిండర్ లీకేజీ.. పెను ప్రమాదం నుండి తప్పించిన ఫైర్ సిబ్బంది

0 15,442

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలోని రూసేగావ్ గ్రామంలోని కాంబ్లే శంకర్ ఇంట్లో శనివారం ఉదయం సిలిండర్ లీకేజీతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమాచారం తెలుసుకున్న మద్నూర్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ వాహనంతో హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి మంటలను అదుపుచేశారు. సిలిండర్ పేలకుండా కాపాడడమే కాకుండా ఇంట్లో ఉన్న తులం బంగారం, 15 తులాల వెండిని, కాపాడి ఫైర్ అధికారులు ఆ కుటుంబానికి అందజేశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇంటి యజమానికి రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ అధికారులు అంచనాల ద్వారా తెలిసింది. ఈ అగ్ని ప్రమాదంలో ఫైర్ అధికారులతో పాటు పోలీస్ శాఖ సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.