29 C
Hyderabad
Monday, August 3, 2026

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వైద్య శిబిరం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని డిపిఎం వెంకటేశం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన రక్త పరీక్షల కేంద్రంను, దంత విభాగాలని, ఆర్థోపెడిక్ విభాగాన్ని, జనరల్ విభాగాలను సందర్శించి తెలుసుకున్నారు. అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీలు వెన్న మురళీ, సాయన్న, సరళ, లక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Everyone should take advantage of the free medical camp.

 

More articles

Latest article