. . . హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు
ఏర్గట్ల, బతుకమ్మ :
మండలం తొర్తి గ్రామం లో ఈర్గాల అనుజ, జంబూక ముత్తేమ్మ, మహ్మ్మద్ తహసీన్ ఉన్నిసాలకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద బూమేశ్వర్ అందజేయడం జరిగింది. సందర్భంలో లబ్ధిదారులు మాట్లాడుతూ పెండ్లి అయిన కొద్ది రోజులకే చెక్కులు రావడం తో మాకు ఎంతో సంతోషంగా ఉన్నదని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద బూమేశ్వర్, ఉప సర్పంచ్ బొల్లపల్లి సుమన్ గౌడ్, ఏర్గట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం గంగ మోహన్, మండల ఆర్ఐ సదానంద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్, వార్డ్ మెంబెర్స్ మోర్తాడ్ సాయన్న, పల్లపు నర్సయ్య, దానం నిఖిత గంగమోహన్, కొండ్ర పద్మ, అడ్వాల గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మెరుగు మహేష్ లు పాల్గొన్నారు.
