జుక్కల్, బతుకమ్మ :
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా విద్యుత్ శాఖ ద్వారా జుక్కల్ మండల కేంద్రంలో మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ, విద్యుత్ అధికారులు లోఓల్టేజ్ కు చెక్ పెట్టారు. జుక్కల్ పట్టణకేంద్రంలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా 100కెవిల మూడు ట్రాన్స్ ఫార్మర్ లతో పాటు 63కెవిల ఒక ట్రాన్స్ ఫార్మర్ బిగించారు. మంగళవారం జుక్కల్ సర్పంచ్ భర్త మాజీ ఏఎంసీ చైర్మన్ కే.సాయగౌడ్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు, విద్యుత్ శాఖ ఏఈ జి.మోహన్ నూతన ట్రాన్స్ ఫార్మర్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీవాసులు సైతం తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్ ఇన్స్ పెక్టర్ లు అనిల్ కుమార్, సుధీర్ పూరితో పాటు ఏఎల్ఎం బోడ సాయిలు, మాజీ ఎంపీటీసీ రామ్ పటేల్, కాంగ్రెస్ శ్రేణులు పావుడే రమేష్, సంతోష్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
