నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని బాలసధనం నుంచి ముగ్గురు మైనర్ బాలికలు మిస్సింగ్ అయ్యారు. సంబంధిత బాలసధనం సూపరింటేండేంట్ ఫిర్యాదుతో ఈ విషయం మంగళవారం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరూ బాలికల ఆచూకి వారి కుటుంబ సభ్యుల వద్ద ఉన్నట్టు గుర్తించారు. మరోక బాలిక ఆచూకి దొరకలేదు. తప్పి పోయిన బాలిక కోసం పోలీస్ శాఖ వెతుకుతున్నారు.
