28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు

Must read

📰 Generate e-Paper Clip

…ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్, బతుకమ్మ : 

 

ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు ఉన్నాయని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2014 లో కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేదని, ప్రస్తుతం సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యంసే సేకరిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకున్నా రైతులకు అండగా ఉన్నామన్నారు. సెంటర్ల లో కనీస వసతులు లేవని,సమగ్ర వ్యవసాయ పాలసీ రూపొందించాల న్నారు.పంటల మార్పిడి పై ప్రభుత్వం అవగాహన కల్పించాలన్నారు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ ఆపేసిన కాంగ్రెస్ బీఆర్ ఎస్ లు బిసిల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. సీఎం రేవంత్ కేసీఆర్ కు గులాం గిరి చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన ఒక్కరినైనా అరెస్ట్ చేశారా కాంగ్రెస్ ను ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బీజేపీ నాయకురాలు స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Errors at every step in grain procurement

 

More articles

Latest article