- కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : భారత జాతి బానిసత్వ విముక్తి, ప్రజల చైతన్యానికి స్పూర్తి వందేమాతరం గీతం అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వందే మతరం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వందే మాతరం గీతం భారతీయుల్లో దేశ భక్తిని రగిలించిన ఉద్యమ నినాదం అని తెలిపారు. ఈ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రరేణగా నిలిచిందన్నారు. ప్రతి భారతీయుడిలో దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవాన్ని ఇలాంటి వేడుకలు మరింత బలపరుస్తాయని తెలిపారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ వేడుకల్లో జిల్లా ఇన్స్ పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

