26.2 C
Hyderabad

నిజామాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే కాలనీల్లో నీటి నాణ్యత తనిఖీలు

Water quality checks in the Nizamabad railway station railway colonies

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 531 నీటి నమూనాలు తాగునీటికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) పరిధిలో ప్రయాణికులు,  రైల్వే వ్యవస్థకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలోని నిజామాబాద్ రైల్వే స్టేషన్, అనుబంధ రైల్వే కాలనీల్లో తనిఖీలు నిర్వహణ, చర్యలు, నీటి నాణ్యత పర్యవేక్షణను మరింత బలోపేతం చేసింది. 21 ఆగస్టు నుంచి 28 సెప్టెంబర్ వరకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ , రైల్వే కాలనీల్లో సేకరించిన 531 నీటి నమూనాలు తాగునీటికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నీటి నాణ్యత పై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ తాగునీరు ఎటువంటి కలుషితానికి గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్లలో సరఫరా చేసే తాగునీరు ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్ లో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే తరచుగా పరీక్షలు , పర్యవేక్షణ చేపట్టడం ద్వారా జోన్ వ్యాప్తంగా ఇదే స్థాయి అప్రమత్తతను కొనసాగించాలని అధికారులు, పర్యవేక్షకులను ఆయన ఆదేశించారు. ప్రయాణికులు,  రైల్వే కాలనీ నివాసితులందరికీ శుభ్రమైన, సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.ఈ తనిఖీల్లో భూగర్భ జల వనరులు, మున్సిపల్ నీటి సరఫరా, నీటి నిల్వ సదుపాయాలు, క్లోరినేషన్ ప్రక్రియలు, నీటి పంపిణీ వ్యవస్థలను పరిశీలిస్తున్నారు. నీటి నాణ్యతపై మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, అవశేష క్లోరిన్ స్థాయిలను ప్రతిరోజూ తనిఖీ చేయడంతో పాటు నీటిలో ఈ.కోలీ వంటి కలుషితాల ఉనికిని గుర్తించేందుకు క్రమం తప్పకుండా బ్యాక్టీరియాలాజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 134 తాగునీటి నమూనాలను బ్యాక్టీరియాలాజికల్ పరీక్షలు నిర్వహించగా, ఏ ఒక్క నమూనా కూడా అసురక్షితంగా గుర్తించబడలేదు. అలాగే ఏ నమూనా కూడా ఈ.కోలీ పాజిటివ్‌గా గుర్తించబడలేదు. ఇంజినీరింగ్, వైద్య విభాగాల అధికారులు సంయుక్తంగా తాగునీటి వనరులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్లు, హై లెవల్ రిజర్వాయర్లును తనిఖీ చేశారు.

Water quality checks in the Nizamabad railway station railway colonies.
 

More articles

Latest article