27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాలో వ్యవసాయానికి అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంది

Must read

📰 Generate e-Paper Clip

 

… రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

జిల్లా వ్యవసాయానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఏ ఒక్క రైతు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని  నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులు ,వ్యవసాయ అధికారులతో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఫార్మర్ అండ్ అగ్రికల్చర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు  గడుగు గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…రైతాంగానికి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా వ్యవసాయ మార్కెట్  సభ్యులు రాష్ట్ర రైతు కమిషన్ దృష్టికి తేవాలన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలకమండలి పనితీరును  అదేవిధంగా హర్టికల్ల్చర్ డిపార్ట్మెంట్ కల్చరల్ జెడి అధికారులతో వ్యవసాయానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైతన్నకి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సేవలను ఆరా తీశారు. రు. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మార్కెటింగ్ పాలక మండలి సభ్యులు వైస్ చైర్మన్ రాంచంధర్,  డైరెక్టర్ , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Enough urea is available for agriculture in the district.

More articles

Latest article