. . . జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రాయితీ యూరియా పక్కదారి పట్టకుండా జిల్లా కేంద్రంలోని పలు పరిశ్రమలలో జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవిందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కొన్ని సొసైటీ ల నుంచి పరిశ్రమల నిర్వహకులు అడ్డదారిలో రాయితీ యూరియాను సేకరించి వినియోగిస్తున్న విషయం వెలుగు చూసింది. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అదేశాల మేరకు యూరియా వినియోగించే పరిశ్రమలలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాయితీ యూరియాను వాడ దగా అనుమానాస్పద పరిశ్రమను సందర్శించి తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాయితీ యూరియాను వ్యవసాయ అవసరాల మేరకు వాడాలి, వ్యవసాయేతర పరిశ్రమలలో వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి ఏఈఓ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు
