24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేష్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సహకార బ్యాంకులను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. నగరంలోని సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లు (బిజినెస్) పెరిగేలా కృషి చేసిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్ముందు కాలంలో కూడా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకు బాగుంటే ఉంటే మనం బాగుంటామని, భవిష్యత్ బాగుంటుందని పునరుద్ఘాటించారు. ఈ ఆర్థిక సంవత్సరం లో ఇప్పటివరకు 14శాతం గా ఉన్న ఎన్పీఏ10 శాతానికి తగ్గించారని, ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు గణనీయంగా తగ్గించాలని సూచించారు. తద్వారా మన బ్యాంకు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అర్హత సాధిస్తామని తెలిపారు. శాఖాధికారులు ఒక్కొక్కరి తో ముఖాముఖి నిర్వహించి వారి శాఖ వివరాలు తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే, ఉన్నతాధికారులు, 63 శాఖల శాఖాధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article