26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పసుపు బోర్డుకు గుండు సున్నా

Must read

📰 Generate e-Paper Clip

. . . అన్ని బోర్డులకు కేటాయింపులు

. . . ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్, బతుకమ్మ :  

పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తరహాలోనే పనిచేసే స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం… పసుపు బోర్డు కు మాత్రం ఒక రూపాయి కూడా కేటాయించలేదని కేంద్ర బడ్జెట్ తర్వాత ఎక్స్ లో పోస్టు చేశారు. పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా నిజామాబాద్ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిధులు లేని పసుపు బోర్డు ఎలా పనిచేస్తుందని, ఏం పరిశోధనలు చేయగలరని ప్రశ్నించారు.

More articles

Latest article