రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకే పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో సీపీఎం గ్రామ పార్టీ శాఖ మహాసభ గంగాధర్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభ సందర్భంగా బస్టాండ్ వద్ద పార్టీ జెండాను లక్ష్మణ్ ఎగరవేశారు. అనంతరం పార్టీ ప్రతినిధుల సభలో గత మూడేళ్ల కాలంలో చేసిన ఉద్యమాల పై సమీక్ష చేసి, భవిష్యత్ కార్యాచరణ పై పలు తీర్మానాలు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని, పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ పిలుపునిచ్చారు. ఈ మహాసభలో నెల్లూరి లక్ష్మన్ ను పార్టీ కార్యదర్శిగా భీమయ్య ( హమాలి ) గంగాధర్ ( చేతి వృత్తిదారుల సంఘం ) గంగారం ( కేవీపీస్ ) సురేష్ ( ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ ) గంగాధర్ ( డివైఎఫ్ఐ) ఎన్నికైనట్లు నన్నే సాబ్ తెలిపారు.
