29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనపూర్ లో ఘనంగా ఊర పండుగ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఘనపూర్ గ్రామం లో గ్రామభివృధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండగ ను ఆదివారం  నిర్వహించినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పండగ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అని తెలిపారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం  గ్రామం లో పాడి, పంటలు, జీవరసులు, మనుషులకు జ్వరాలు రాకుండ ఈ పండగ నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం ముడుపు వేసి, శుక్రవారం భూలక్ష్మీకి, పండగ చేసి శనివారం మోగించి, గ్రామంలో ఉన్న 18 దేవుళ్ళు చేసి వాటికీ ఆదివారం గ్రామం మధ్యలో పెట్టి పూజలు, గావా పట్టి గ్రామం లో ప్రతి ఒక్కరు వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వైభవంగా చేస్తారని తెలిపారు. తర్వాత దేవుళ్లను ఊరేగింపుగ తీసుకోని గుడిలో ప్రతిష్ట చేయడం జరుగుతుందన్నారు. ఈ పండుగలో గ్రామభివృద్ధి కమిటీ, యువకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article