డబుల్ బెడ్ రూమ్ అర్హులకే ఇవ్వాలి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకే పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో సీపీఎం గ్రామ పార్టీ శాఖ మహాసభ గంగాధర్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభ సందర్భంగా బస్టాండ్ వద్ద పార్టీ జెండాను లక్ష్మణ్ ఎగరవేశారు. అనంతరం పార్టీ ప్రతినిధుల సభలో గత మూడేళ్ల కాలంలో చేసిన ఉద్యమాల పై సమీక్ష చేసి, భవిష్యత్ కార్యాచరణ పై పలు తీర్మానాలు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని...