– విద్యార్థి అమరుల స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించండి
– పీడీఎస్యూ 50 వసంతాల సభలో వక్తల పిలుపు
నిజామాబాద్, బతుకమ్మ : ప్రగతి శీల విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాలని పీడీఎస్యూ 50వసంతాల సభలో వక్తలు పిలుపునిచ్చారు. పీడీఎస్యూ 50 వసంతాల ఆత్మీయ సమ్మేళనం కామారెడ్డి పట్టణ కేంద్రంలోని బీఈడీ కళాశాలలో కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్యూ మాజీ జిల్లా అధ్యక్షులు బలరాం చవాన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.ఈ కార్యమానికి ముఖ్య వక్తగా పీడీఎస్ యూ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పి.నర్సింహులు, మాజీ జిల్లా సహాయ కార్యదర్శి బాలరాం చవాన్, జగన్నాద్, శ్యామ్ రావు హాజరై మాట్లాడారు. కోట్లాది మందిలో చలనాన్ని అందించి పోరుబాటలో నడిచిన సంస్థ పీడీఎస్యూ అని అన్నారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ లో జార్జ్ రక్తంతో తడిసిన బిగి పిడికిలి పతాకం జె.సి. ఎస్. ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, చేరాలు, కోలా శంకర్, చాంద్ పాషా,స్నేహలత, రంగవల్లి, రమణయ్య, సాంబయ్య, తదితరుల త్యాగాల చరిత్రతో విద్యార్థి ఉద్యమాన్ని ఉదoతం చేసిన పీ.డీ.ఎస్.యూ కోట్లాది విద్యార్థులకు మార్గదర్శి అయ్యిందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని ఉద్యమాలు కొనసాగిస్తున్న విద్యార్థి సంఘం పీ.డీ.ఎస్.యూ అని అన్నారు. ఈ దేశంలో పేదలు అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ సమానమైన, శాస్త్రీయమైన విద్యను అందించాలని, విద్యార్థి ఉద్యమాలను కొనసాగిస్తుoదన్నారు. ఈ నెల 30న రాష్ట్ర స్థాయిలో ఓయూ లోని ఆర్థి్టోరియంలో జరిగే సభకు విద్యార్థులు, పూర్వ, ప్రస్తుత పీడీఎస్ఈయు నాయకులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు.
– వార్సికొత్సవ సభ పోస్టర్స్ ఆవిష్కరణ:
సభలో పి డి ఎస్ యూ 50 వార్షికోత్సవసభ పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. సభలను విజయవంతం చేయాలని నేతలు పిలుపును ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, ప్రస్తుత పీడీఎస్యూ అధ్యక్షులు సురేష్, పీడీఎస్యూ మాజీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు
