24 C
Hyderabad
Sunday, August 2, 2026

పలు కార్యక్రమాలకు భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

*బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంని డోన్ పాల్ గ్రామంలో సోమవారం పలు పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో ఎస్సీ మాల సంఘం కిచెన్ షెడ్డు కోసం మూడు లక్షలు, మాదిగ సంఘంలో కిచెన్ షెడ్డు కోసం మూడు లక్షలు, పర్స సంఘం మినీ ఫంక్షన్ హాల్ కొరకు ఐదు లక్షలు, రాంనగర్ కాలనీ వడ్డెర సంఘం ప్రహరి గోడ నిర్మాణానికి 3 లక్షల నిధులతో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల పెద్దమనుషులు, ప్రజలు, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోన్ పాల్ విలేజ్ ఇంచార్జ్ వై శ్రీ, నాయకులు గడ్డం అనిల్ రెడ్డి, గడ్డం రవి గ్రామ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ సాయి ప్రసాద్, కిషన్, నారాయణ, దేవేందర్, తరుణ్, గాల్ రెడ్డి, శ్రీనివాస్, రణీత్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article