30.9 C
Hyderabad

ఎస్సీ ఎస్టీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాల అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ  నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎస్సీల అభివృద్ధి కోసం  వారి ఎదుగుదల కోసం ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతోందన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఎస్సీల అభివృద్ధి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలుచేపట్టడం లేదని విమర్శించారు. అంతేకాకుండా అణగారిన వర్గాలపై దాడులు  అధికమవుతున్నాయని అన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు భద్రత కరువైందన్నారు.

More articles

Latest article