. . . నగదు రివార్డు సత్కారించిన పోలీస్ కమిషనర్
ఆర్మూర్, బతుకమ్మ:
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇండియన్ బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్లో చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను విధి నిర్వహణలో ఉన్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఎస్. నాగరాజు ,ఎన్. అశోక్ ,లు అప్రమత్తతతో, చాకచక్యంగా పట్టుకోన్నారు. మంగళవారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత బ్లూ కోల్ట్స్ సిబ్బంది కి నగదు రివార్డు అందజేసి , వారి విధి నిర్వహణ పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బ్యాంకు వంటి కీలకమైన ఆర్థిక సంస్థ చోరీకి యత్నిస్తున్న నిందితులను సకాలంలో గుర్తించి పట్టుకోవడం ద్వారా పెద్ద నేరం జరగకుండా సమర్థవంతంగా అడ్డుకున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది విధి నిర్వహణకు ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని , రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ అనుమానాస్పద వ్యక్తుల , కార్యకలాపాలను గుర్తించి తక్షణమే స్పందించాలని సూచించారు. పోలీసుల అప్రమత్తత , సమయస్ఫూర్తి , విధి పట్ల అంకితభావం ప్రజల ఆస్తులు , ప్రాణాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా ప్రతి పోలీస్ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని , విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది ని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర రెడ్డి , ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు గలరు.

