30 C
Hyderabad

కోర్టు ధిక్కరణకు పాల్పడిన జిల్లా స్థాయి అధికారులపై చర్యలేవి?

What action is being taken against district-level officials who have committed contempt of court?

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  రెవెన్యూ అధికారుల అలసత్వంపై చర్యలు తీసుకుంటారా?

 

. . . అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇచ్చిన అధికారులపై చర్యలేవి

 

. . . సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఇటీవల కోర్టు ధిక్కరణకు పాల్పడిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నామని మరి నిజామాబాద్ జిల్లాలో కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం నగరంలోని కోటగల్లిలోని ఎన్ఆర్ భవన్ లో సీపీఐ(ఎంఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం, జిల్లా నాయకులు రమేష్ లు మాట్లాడుతూ సిరికొండ మండల కేంద్రంలో 532 సర్వే నంబర్ లో  209లో పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, భూములపై న్యాయపోరాటం చేయగా 2012లోనే న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దాదాపు 14 సంవత్సరాలుగా అర్హులైన బాధితులకు భూములు అందజేయడంలో జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నలు లేవనెత్తారు. న్యాయస్థానం ఆదేశించిన అధికారులు ఎందుకు పేదలకు న్యాయం చేయడం లేదో ప్రజలకు సమాదానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో 96 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు గాను 92 మందికి కేటాయించారని అందులో 22 మంది అనర్హులున్నారని తెలిపారు. అర్హులైన నలుగురికి ఇళ్ళను కేటాయించకపోతే బాధితులు హైకోర్టును ఆశ్రయించగా వారిని అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అనర్హులను, స్థానికేతరులను ఎంపిక చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటారా అని అధికార యంత్రాంగాన్ని నిలదీశారు. కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా స్థాయి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article