27.2 C
Hyderabad

ప్రజావాణి లో శ్రీ చైతన్య పాఠశాలపై ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో లో సోమవారం  నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సంధర్భంగా నగర అధ్యక్షడు అఖిల్ మాటడుతూ నిజామాబాద్ జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం  ప్రభుత్వం నిర్దేశించిన రెండో శనివారం, ఆదివారం  సహా ఇతర అన్ని సెలవు రోజులను విద్యార్థులకు అందించకుండా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక  ఒత్తిడికి  గురిచేస్తున్నారని అన్నారు. ఈ సమస్య జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారి మానసిక ఒత్తిడిని తగ్గించేలా పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించని పక్షంలో పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ కర్యకమంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు ప్రణయ్, సాయి, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article