29.3 C
Hyderabad

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : రాబోయే రోజుల్లో తమ పార్టీ తరఫున ప్రతి గ్రామంలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తమ జోలికి వచ్చిన మహా మహులు మట్టికరుచుకుపోయారని.. అందుకే నా జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసం చేయరని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రజాశాంతి పార్టీ తరపున ప్రతి గ్రామంలో ఉచిత వైద్యం, విద్య అందిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు బీసీ నినాదాన్ని ఎంచుకున్నాయన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారన్నారు. నా జోలికి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి గాలిలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. చనిపోక ముందు డి.శ్రీనివాస్‌ తనతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బీసీలను పీసీసీ చీఫ్‌లుగా చేసి బానిసలుగా మారుస్తుందని చెప్పారని పేర్కొన్నారు. మధుయాష్కీ తనను కలిసిన తర్వాతే రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని చెప్పారు.

More articles

Latest article