ఈసారి మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం

0 1,443
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే
  • ఎన్నికలు ఉన్నాయని వలస పక్షులు తిరిగి వాలుతున్నాయి
  • బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే వలస పక్షులు మళ్లీ  వాలున్నాయని ఎమ్మెల్సీ కవితను పరోక్షంగా ఉద్దేశించి నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జనం కవితను ఎప్పుడో మరిచిపోయారని  అన్నారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించడానికే ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారని  కవిత అంటున్నారని, గత పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేయలేదని కవిత ఒప్పుకున్నారన్నారు. గత పదేళ్ల లో బీ(టీ)ఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, కుటుంబ పాలన, ప్రజా ప్రతినిధుల ఇండ్లపై దాడులు, లిక్కర్ స్కాం లతో కాలం వెళ్లదీశారన్నారు. బీఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాలకు హామీల అమల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదని అన్నారు. ‘పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్’ గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసిందే కేసీఆర్ సర్కారేనని అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ పోలీసింగ్ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు లో కాంగ్రెస్ పోలీసింగ్ లా పోలీసు వ్యవస్థ తయారైందన్నారు. కెసిఆర్ విధానాలను అమలు చేయమని కాంగ్రెస్ సర్కారుని కవిత రుతున్నారని, ప్రస్తుతం రేవంత్ సర్కార్ ప్రజల వాగ్దానాలను గాలికి వదిలేసి అదే ఫార్ములాను  పాటిస్తున్నాడన్నారు.  భయపడే రక్తం కాదని కవిత అంటున్నారని, ఆమెది జలగల్లా పిలిచే రక్తమని వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్, కేటీఆర్ కి భయం లేకపోతే క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. నిజామాబాద్ పవర్ ఏందో చూపిస్తామని  కవిత అంటున్నారని, 2019 పార్లమెంట్, 2020  కార్పొరేషన్ ఎన్నికల్లోనే నిజామాబాద్ పవర్ ఏందో ప్రజలు చూయించారన్నారు. బీఆర్ఎస్ నిజామాబాద్ లో ఎప్పుడో ఖతం అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం దొరకరని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండానే అన్నారు. గత ఎన్నికల్లో  మేయర్ స్థానాన్ని తృటిలో కోల్పోయామని , ఈసారి పూర్తి మెజారిటీతో  మేయ స్థానాన్ని కైవసం చేసుకుంటామని  స్రవంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

This time we will take the seat of the mayor

Leave A Reply

Your email address will not be published.