29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అవగాహన పేరిట వసూళ్లు..

Must read

📰 Generate e-Paper Clip

  • ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద పైసల వసూళ్ల కు చెక్ పెట్టేది ఎవరు..?
  • ఆర్టీఏ చెక్ పోస్ట్ లు ఎత్తివేసిన ఆగని వసూళ్లు
  • అవగాహన అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుపై వాహనాల నిలుపుదల
  • సలబత్ పూర్ లో ఆగని వసూళ్లు

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర సరిహద్ధులలోని రవాణా శాఖ చెక్ పోస్టులలో వసూళ్ల పర్వం ఆగడం లేదు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రాంతాలలోని రవాణా శాఖ చెక్ పోస్టులను ఎత్తివేస్తు ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా శాఖకు వాహనాల ద్వార లభించే పన్నుల వసూళ్ల వ్యవహరంను ఎన్ పోర్స్ మెంట్ టీంలకు అప్పగిస్తు నిర్ణయం తీసుకుంది. ఐతే రాష్ట్రంలో ఆర్టీఏ శాఖలో ఇటీవల రిక్రూట్ అయిన ఎఏంవిఐలకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అది ఈ నెల చివరి వరకు పూర్తి కానుంది. అప్పటి వరకు రవాణా శాఖా ఆదాయానికి గండిపడుతుందని రవాణా శాఖ చెక్ పోస్టులలో వాహనాల పన్నుల చెల్లింపు, పర్మిట్ ల విధానం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం గురించి అవగాహన కార్యక్రమం చేయాలని సంకల్పించింది. కాని రవాణా శాఖలో ప్రతి నిత్యం కాసులు లేకుండా ఇంటిముఖం చూడని అధికారులు మళ్లీ దళారులను రంగంలోకి దించి అవగాహన పేరిట వాహనాలను ఆపుతు వసూళ్లు చేస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్ పూర్ చెక్ పోస్టు వద్ధ వసూళ్ల పర్వం మాత్రం ఆగడం లేదు.

Collections in the name of awareness..

ప్రభుత్వానికి ఆదాయ వనరులలో పేరొందిన శాఖలలో రవాణా శాఖ ఒకటి. ఆర్టిఏ ద్వార ప్రభుత్వానికి అధిక రాబడి. కాని అందులో పనిచేసే అధికారులకు చెక్ పోస్టు డ్యూటీ, ఎన్ పోర్స్ మెంట్ డ్యూటీ అంటే బంగారు గుడ్లు పెట్టే బాతు అంటే అతిశయోక్తికాదు. ఎన్ పోర్స్ మెంట్ లో, చెక్ పోస్టులలో ఒక్కరోజు డ్యూటీ చేస్తే ప్రభుత్వ ఆదాయం దేవుడు ఎరుగు కాని ఒక ఎంవిఐకి రూ. 50 వేలు, ఎఏంవిఐకి 40 వేలకు తగ్గకుండా రాబడి ఉంది. అక్కడ వారు తమ చేతికి మట్టి ఆంటకుండా ఎజేంట్లు (వసూళ్లకు) నియమించి వారికి ఒక్కరోజుకు చెల్లించేది రూ.5 వేలు అంటే అక్షరాల వారి నెల రాబడి రూ.1.50 లక్షలు అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో అత్యంత అవినీతి వసూళ్ల కేంద్రాలుగా రవాణా శాఖ చెక్ పోస్టులకు పేరుంది. దానితో గడిచిన నాలుగు మాసాలలో అవినీతి నిరోధక శాఖ చెక్ పోస్టులపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్ పూర్ చెక్ పోస్టుపై అధికారులు మూడు నెలల క్రితం దాడి చేసి నోరు ఎళ్లబెట్టారు. అ దాడిలో ఎఏంవిఐ, ఎజేంట్ల వద్ద దొరికిన సొత్తు కేవలం ఆరు గంటలలో 96 వేల రూపాయాలు. ఇంకో ట్విస్టు ఏమిటంటే అక్కడ డబ్బులు వసూలు చేయరు డిమాండ్ చేయరు నేరుగా అక్కడ ఏర్పాటు చేసిన గల్లపేట్టే (అట్ట డబ్బా) లో డబ్బులు వేసిన తరువాతనే వాహనం కదిలేది. ఎసిబి అధికారులు ఉన్న తరువాత కుడా డబ్బుల వసూళ్లు ఆగకపోవడం వారిని ఆశ్చర్య చకితులను చేసింది. అక్కడ ఎసిబి అధికారులు నగదును స్వాధీనం చేసుకుని ఆనాడు విధులలో ఉన్న ఎఏంవిఐతో పాటు ఎజేంట్లపై చర్యలకు సిపారసు చేసిన అవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.

Collections in the name of awareness..

సాధారణంగా రవాణా శాఖకు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఉండటం సర్వసాధారణం. ఎంవిఐకి నెలకు రూ.5 లక్షలు, ఎఏంవిఐకి రూ.10 లక్షల పన్నూల వసూళ్లు టార్గేట్  నిర్ణయించబడింది. కాని చెక్ పోస్టులలో ఆదాయం అదనం. దానిని సొమ్ము చేసుకోవడం మరువని అధికారులు ఇప్పుడు ఎజేంట్లను పెట్టి అవగాహన పేరిట అందినకాడికి దండుకుంటున్నారు. సలబత్ పూర్ చెక్ పోస్టులో మద్నూర్ కు చెందిన ప్రధాన దళారి ఆధ్వర్యంలో 10 మంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చెక్ పోస్టుల వద్ద ఉన్న దుకాణాలు, కోకాలను ఎత్తివేసిన వసూళ్లు మాత్రం దర్జాగా చెక్ పోస్టులలోనే సాగిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇస్తు మిగిలిన సొమ్మును కమీషన్ రూపంలో కాజేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కుడా తమ చేతికి మట్టి అంటదని మద్నూర్ కు చెందిన దళారి తో కాసుల బేరాలు సాగిస్తున్నారు. ఇటీవల ఎసిబి దాడుల తరువాత చెక్ పోస్టుకు అవతల 1000 మీటర్ల దూరంలో, ఇవతల కుడా అంతే దూరంలో వాహనాలను ఆపి మరీ వసూళ్లు చేస్తున్నారు. ప్రతినిత్యం చెక్ పోస్టులు ఎత్తివేసిన తరువాత కుడా ఆగకుండా వసూళ్లు చేస్తున్నారు. ఎదైన విషయం వస్తే అంత ఎంవిఐ లేదా ఎఏంవిఐ చూసుకుంటారని చెబుతు వసూళ్లు చేయడం విశేషం. పేరుకే చెక్ పోస్టులను ఎత్తివేసిన అధికారులు అవగాహన పేరిట జరుగుతున్న వసూళ్ల పర్వానికి చెక్ పెట్టకపోవడం విశేషం. మరోసారి ఎసిబి అధికారులు సర్ ప్రైజ్ చెకింగ్ లు చేస్తేగాని వారి బండారం బట్ట బయలయ్యే అవకాశం లేదు.

Collections in the name of awareness..

More articles

Latest article