- కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ : పట్టణంలోని మహాలక్ష్మి కాలనీని తప్పకుండ అభివృద్ధి చేస్తామని ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మహాలక్ష్మి కాలనీవాసుల ఆహ్వానం మేరకు కాలనీని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు సమస్యలుంటే తన దృష్టికి తేవాలని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాలనీ కమ్యూనిటీ భవనంలో కాలనీవాసులు వినయ్ రెడ్డి తొ పాటు కాంగ్రేస్ నాయకులను షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు,ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్,ఆర్మూర్ పట్టణ మాజీ చైర్మన్లు పవన్ పండిట్ , అయ్యప్ప శ్రీనివాస్ , మాజీ కౌన్సిలర్ కొంతo మురళి, పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహాలక్ష్మి కాలనీ ప్రెసిడెంట్ , వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ,కార్యకర్తలు పాల్గొన్నారు.
