25.5 C
Hyderabad

ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన సీఎం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి నర్సమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గురువారం నరసమ్మ దశదిన ఖర్మ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి, ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.

More articles

Latest article