రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం

0 8,126

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని తిలక్ గార్డెన్ చౌరస్తాలో శుక్రవారం రెడ్డి జాగృతి దిష్టిబొమ్మను    బీసీ నాయకులు దహనం చేశారు. ఈసందర్భంగా బీసీ సంఘం నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలకు కేటాయించిన 42  42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి  హైకోర్టులో కేసు వేసి స్టే తెచ్చి నిలుపుదల చేయించినందుకు నిరసనగా  వారి దిష్టి బొమ్మను దహనం చేాశామన్నారు.  ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన,  బీసీలకు న్యాయంగా చెందాల్సిన హక్కులను సాధించుకుంటామన్నారు. బిసి జిల్లా నాయకులు నరాల సుధాకర్, సత్య ప్రకాష్ కొయ్యడ శంకర్ లను ముందస్తు అరెస్టు చేసి నాలుగోవ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించినా నిరసన కార్యక్రమం చేపట్టమన్నారు.  బీసీ ద్రోహులకు తగిన గుణపాఠం నేర్పుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగ కిషన్ అన్నారు… భవిష్యత్తులో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర నాయకులు ఆకుల ప్రసాద్ బసవ సాయిరాజ్ విజయ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో దర్శనం దేవేందర్ తో పాటు పోల్కం గంగ కిషన్, బగ్గలి అజయ్, విజయ్, శ్రీలత, ఆకుల ప్రసాద్, బసవసాయి, జయ, రుక్మిణి, మాకు రవి, తోట మహేష్, సత్యనారాయణ, బాలన్న,రూరల్ నాయకులు నర్సయ్య, కెంపు సాయిలు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.