27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓరియేంటేషన్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఓరియేంటేషన్ ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్మీ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి రోజు కళాశాల కు రెగ్యులర్ గా క్లాస్ లు అటెండ్ కావాలి అని, ఐడెంటిఫికేషన్ కార్డు అందరు ధరించాలని,తరగతి గది లో మొబైల్ ఫోన్ వాడకూడదు అని, క్రమశిక్షణ, మరియు శుభ్రత పాటించాలని,అకడమిక్ కార్యక్రమాలలో, గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ప్రిన్సిపాల్ సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ యం చంద్రకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు డిజిటల్ క్లాస్ లు వినాలని,కళాశాల లైబ్రరీ ని వినియోగించుకోవాలి అని,కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్స్ విద్యను అభ్యసించాలి అని విద్యార్థులకు తెలిపారు. కళాశాల TSKC అధికారి కామర్స్ విభాగం అధిపతి శివ కుమార్  మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్ సెల్ లో ప్రతి విద్యార్ధి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని, ఉన్నత విద్యలో ఉన్న ప్రతి అంశాలను నేర్చుకోవాలి అని విద్యార్థులకు తెలియజేసారు. కళాశాల మహిళా సాధికారిక అధికారి డాక్టర్ ఎస్ గోదావరి మాట్లాడుతూ కళాశాల లో ఉన్న అమ్మాయిలు ఏమైనా ఉన్న సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలి అని సూచించారు. జాతీయ సేవ పథకం అధికారులు రాణి మేడం, చంద్ర కాంత్  లు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల క్యాంపస్ ను శుభ్రం గా ఉంచుకోవాలి అని, క్యాంపు లో పాలుగొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తాము అని తెలిపారు.కళాశాల తెలుగు విభాగం అధ్యాపకులు అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ కళాశాల లో ఉన్న పుస్తకాలు చదువాలని  లైబ్రరీ లో ఉన్న బుక్స్ వాడుకోవాలి అని తెలిపారు. కళాశాల కెమిస్ట్రీ విభాగం అధిపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ బ్లాగ్  ను విద్యార్థులకు అందుబాటులో ఉంచామని విద్యార్థులు స్కాన్ చేసి అందులో లభించే బుక్స్ ను చదువుకోవాలి అని, సైన్స్ విద్యార్థులకు కొరకు యు ట్యూబ్ లో అప్లోడ్ చేసిన తమ వీడియోస్ క్లాస్ లు విని చదివి అందరు పాస్ కావాలి అని తెలిపారు.ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ను కళాశాల అర్థ శాస్త్ర అధ్యాపకులు కృష్ణ ప్రసాద్ వందన సమర్పణ తో ముగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నాగనీక,డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దురాజు, కృష్ణప్రసాద్,శశిధర్,చంద్ర కాంత్,,సురేష్ రెడ్డి, కీర్తి స్వప్న,కిరణ్ కుమార్ ,మోయిన్, దశరథ్, మహమూద్, కళాశాల సూపరింటెండెంట్ వసంత లక్ష్మి నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Orientation for students at Yella Reddy Government Degree College

More articles

Latest article