26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా సిఐటియు 56 వ ఆవిర్భావ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (సిఐటియు) 56 వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద ఘనంగా జరిగింది. శనివారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ జెండా వివిధ రంగాల కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా  ఉప అధ్యక్షులు రమేష్ బాబు, జెండాను ఎగరవేయడం జరిగింది .ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి పెద్ద ఎత్తున నినాదాలు చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 1970 జూన్ 30 న కార్మిక వర్గం ఐక్య పోరాటాలను నిర్వహించడం కొరకు తమ హక్కుల సాధనకు సమస్యల పోరాటాల వైపు కార్మిక వర్గాన్ని కదిలించడం కొరకు సిఐటియు ఆవిర్భవించిందని గుర్తు చేశారు.  నాటి నుండి నేటి వరకు 17 సార్లు దేశవ్యాప్త సమ్మె నిర్వహించి కార్మిక వర్గం ఐక్యతను చాటడం జరిగిందని ,ఐక్య పోరాటాల మూలంగా అనేక హక్కులు సాధించుకున్నారని అన్నారు. కానీ నేటి పాలకులు బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకురావడం జరిగిందని ,దీని మూలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు హరించబడతాయని, అందువల్ల భవిష్యత్తులో సమరశీల ఐక్య పోరాటాలను కార్మిక వర్గం నిర్వహించాల్సిన అవసరం ఉందని ,అందుకే కార్మికులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనేకమంది కార్మిక నాయకులు కార్మికులు జీవితాలను త్యాగం చేసి చట్టాలు సాధిస్తే, ప్రభుత్వం వాటిని రద్దు చేయడం శోచనీయమని, అందువల్ల వాటి పునరుద్ధరణకు సంఘటిత పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు .ఈ కార్యక్రమంలో మెడికల్  రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు ,అంగన్వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి  స్వర్ణ మున్సిపల్ యూనియన్ లిఫ్ట్ ఇరిగేషన్ యూనియన్ నాయకులు రమేష్, సిఐటియు నగర నాయకులు నరసయ్య, అంజయ్య, రాజు,సూచిత తదితరులతోపాటు ఆయా రంగాల కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సారంగాపూర్ సీడ్ కార్పొరేషన్ హమాలీ కార్మికులు సిఐటియు లో చేరటంతో కార్పొరేషన్ ఎదుట వారికి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దస్తగిరి, లక్ష్మణ్,అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా సిఐటియు జెండా సిఐటియు జిల్లా అధ్యక్షులు మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు  ఎగరవేయడం జరిగింది.

CITU celebrates its 56th foundation day with grandeur

More articles

Latest article