. . . ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి
ముప్కాల్, బతుకమ్మ :
జూన్ 21న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే తెలంగాణ ఉద్యమ కారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈ మేరకు బాల్కొండ నియోజక వర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకులు సమ్మేళణం పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ కి తరలి వచ్చి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బోరెల్లి సురేష్, రాష్ట్ర అధ్యక్షులు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్, రాంజీ చార్వాక్ దమ్మ ప్రచారక్ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు, సంజీవ్ థామస్ దళిత బహుజన నాయకులు ఈ.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
