24 C
Hyderabad
Sunday, August 2, 2026

సర్వీస్ రూల్స్ ప్రమోషన్ల కోసం హెడ్‌మాస్టర్ల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ:

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో హెడ్‌మాస్టర్లు ధర్నా నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ  తెలంగాణ వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు శనివారం హైదరబాద్ లో ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సురేష్ నాయకులు మాట్లాడుతూ, హెడ్‌మాస్టర్లకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పదోన్నతుల్లో ఉన్న అసమానతలు తొలగించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.పాఠశాలల్లో పరిపాలన భారం పెరగడంతో విద్యా ప్రమాణాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు హెడ్‌మాస్టర్ల హక్కులను పరిరక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే మూడు దశల ఆందోళన కార్యక్రమాలు ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని హెడ్‌మాస్టర్లు కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ ప్రధాన కార్యదర్శి నరేష్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సురేష్ కోశాధికారి దృపత్ కుమార్ , గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మినర్సయ్య, ఎంఇఓ లు, మూడు డివిజన్ ల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

More articles

Latest article