. . . పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి పోలీసులు జూదం అడ్డాలపై మెరుపు దాడులు చేసారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పత్తాలాట ఆడుతున్న నలుగురు ని పట్టుకొని వారి వద్ద 4,320 నగదు, 3 ఫోన్లు, 4 బైకులు సీజ్ చేశారు.ఎల్లారెడ్డి పి ఎస్ పరిధిలో పేకాట స్థావారం పై దాడి చేసి ముగ్గురిని పట్టుకొని వారి నుంచి రూ.6,250 నగదు, 3 ఫోన్లు సీజ్ చేశారు.నసురుల్లా బాద్ పిఎస్ ఏరియాలో జూదం ఆడుతున్న 4 మంది పట్టివేత వారి వద్ద రూ.1,410 నగదు, 2 ఫోన్లు సీజ్ చేసారు. మొత్తం 11 మంది పై కేసులు నమోదు చేసి 11,980 నగదు, 8 ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. జూదం క్షణిక ఆనందం.. జీవితాంతం నష్టం. కష్టార్జితాన్ని పణంగా పెట్టి కుటుంబాలను రోడ్డున పడేయకండి. ఆడినా, ఆడించినా కఠిన చర్యలు తప్పవు అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.

