24.2 C
Hyderabad

8మంది ఐఏఎస్ ల బదిలీ

Transfer of 8 IAS officers

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐఏఎస్, నాన్‌కేడర్ అధికారులను బదిలీ చేస్తూ మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధి, మున్సిపల్ పరిపాలన, మెట్రో రైలు, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక పోస్టుల్లో మార్పులు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్ఫరాజ్ అహ్మద్ కు హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ చేసిమెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించారు. హెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ.వి. నరసింహారెడ్డికి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించడంతో పాటు హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించారు. బి.అజిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్వెస్ట్ తెలంగాణ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ సీఈఓగా కొనసాగనున్నారు. మయాంక్ మిట్టల్ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. కె. చంద్రకళకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ) బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. ఐ.ఈ.ఎస్.ఎస్.డి. మనోజ్ ను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పి.రామును స్టేట్ ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను విద్యాశాఖలో స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా నియమించారు. వి.శ్రీనివాస్ రెడ్డి బదిలీ నేపథ్యంలో మాతృశాఖకు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ బదిలీల్లో ప్రధానంగా హైదరాబాద్ నగర పాలన, పట్టణాభివృద్ధి, మెట్రో రైలు, మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పోస్టుల్లో మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం.

Transfer of 8 IAS officers

More articles

Latest article