29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

యువత ద్వారానే సమాజంలో మార్పు

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు నియామక పత్రాలను రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గానీ స్వాతంత్ర ఉద్యమంలో గానీ యువతదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు మేము ప్రయత్నిస్తున్నామన్నారు. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని భావిస్తున్నానని తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని కోరారు.

Change in society through youth

More articles

Latest article