29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ హక్కుల కోసం 18న బీసీ బంద్

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా బీసీ జేఏసీ చైర్మెన్ పోతనకర్ లక్ష్మి నారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ హక్కుల కోసం 18న బీసీ బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ జేఏసీ చైర్మెన్ పోతనకర్ లక్ష్మి నారాయణ తెలిపారు. నిజామాబాదు నగరంలోని గీత భవన్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పోతనకర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన బీసీ బంద్ ను విజయవంతం చేయాలని అన్ని బీసీ సంఘాలను, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయకపోతే, బీసీలను మోసం చేసినట్లే అవుతుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బీసీ లను విభజించి, బలహీనపరచాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయన్నారు. బీసీలు ఈసారి మోసపోరు.. హక్కుల కోసం ఆరాటం చేస్తున్న ప్రతి బీసీ ఒక సైనికుడిలా ముందుకు రావాలని అన్నారు. బీసీ లకు రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో సమాన హక్కులు లభించేవరకు మా పోరాటం ఆగదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీ ల సంఖ్యను ఆధారంగా చేసుకొని రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూసే రాజకీయాలను సహించమన్నారు. బీసీ జేఏసీ ఈసారి ప్రజలతో కలిసి ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతుందన్నారు. బంద్ విజయవంతం కావడానికి నిజామాబాదు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, ఆటో, క్యాబ్ యూనియన్లు, కార్మిక సంఘాలు తమ మద్దతు ప్రకటించాలని కోరారు. బీసీ బంద్ అనేది కేవలం ఒక నిరసన కాదు — ఇది బీసీల గౌరవం, హక్కు, హోదా కోసం ప్రారంభమైన మహా ఉద్యమం” అని తెలిపారు. వైస్ చైర్మెన్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ నిజామాబాదు జిల్లాలో బీసీ బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బీసీ ఒక్కటేతే మన సత్తా ఏంటో చూపెట్టాలి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు నిలిచి బందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజ్, కో కన్వీనర్ మాస్టర్ శంకర్, అంబదాస్ రావు,బూరుగలా వినోద్, ఎనుగుందుల మురళి,నవతే ప్రతాప్, అమందు విజయ్ కృష్ణ,చింతకాయల రాజు, కస్తూరి కృష్ణ, బొట్టు వెంకటేష్, ఇందల్వాయి కిషన్ బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతనిధులు పాల్గొన్నారు.

More articles

Latest article