యువత ద్వారానే సమాజంలో మార్పు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు నియామక పత్రాలను రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గానీ...