హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ ఎస్పీ ఆర్ హిల్స్ గ్రౌండ్స్ లో గురువారం నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. మరో కారు, ట్రాలీ ఆటో పాక్షికంగా దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారా అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని ఇళ్ల వారు ఈ గ్రౌండ్ లో కార్ లు పార్కింగ్ చేస్తుంటారు. కాగా ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.