బతుకమ్మ,ఏర్గట్ల: బుధవారం రోజు మండల కేంద్రం చత్రపతి శివాజీ విగ్రహం వద్ద నిన్న జమ్మూ కాశ్మీర్లో హిందూ పర్యాటకుల పైన జరిగిన హేయమైన చర్యకు నిరసనగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఏర్గట్ల మండలంలోని అన్ని హిందూ యువజన సంఘాలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో హిందూ పర్యాటకులను ఒక్కొక్కరిగా వారి ఐడెంటిటీ కార్డులు చూసి కాల్చడం ఐడెంటి కార్డు లేని వారిని బట్టలు విప్పి హిందువుగా నిర్ధారించుకొని కాల్చడం చాలా హేయమైన చర్యగా పరిగణించారు. . గతంలో పుల్వామా దాడి చేసినందుకు గాను ఒకింతకు పదింతల ఎలా అనుభవించారో అలాగే ఇట్టి చర్యకు పాల్పడిన వారిపై ఒకటి 100 రేట్లు ప్రతీకారం తీర్చుకుంటాం అని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి ఈరపట్నం నరసయ్య, మరియు అన్ని కులాల హిందూ యువజన సంఘం ల నాయకులు పాల్గొన్నారు.