రక్తదానం చేసేవారు ప్రాణ దాతలు

0 9,713

 

. . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

. . . టీఎన్జివోస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రక్తదానం చేసేవారు రక్తదాతలు మాత్రమే కాదని ప్రాణదాతలు అని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా టీఎన్జీవోస్ నిజామాబాద్ జిల్లా పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన ఐ డి ఓ సి కార్యాలయ మీటింగ్ హాల్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.రేకుల పల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూనే సమాజ సేవలో మేము సైతం అంటూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన నాటి నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు, జిల్లాలో గల తలసేమియా బాధితుల సేవార్ధం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరిని అభినందించి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఒక ప్రాణాన్ని కాపాడడానికి రక్తం ఆవశ్యకతను వారు వివరించారు. అలాగే ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్, రాష్ట్ర గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతపూర్ గంగాధర్, ఉమ్మాజి నరేష్, పొలసాని శ్రీనివాస్, మోహన్, శ్యాంసన్, ధర్మాగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Blood donors are life donors.

Leave A Reply

Your email address will not be published.