24.7 C
Hyderabad
Monday, August 3, 2026

యూఎస్పీసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మెండోరా మండల ఆధ్వర్యంలో మెండోరా మండల తాసిల్దార్ కు బుధవారం మెమోరండం అందజేశారు. యూఎస్పిసి నాయకులు ఓ రమేష్, ఓడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ సమస్యలను, ఆర్థికమైన సమస్యలను చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నందున వాటన్నిటిని పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్ధరించాలి అన్ని క్యాడర్ల ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలి 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని కొత్తగా ఏర్పడిన జిల్లాలకు డిఇఓ పోస్టులను మంజూరు చేయాలని పిఆర్సి నివేదికను తెప్పించుకొని వెంటనే ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వాలని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ పిల్లలను వెంటనే చెల్లించాలని 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఈ  ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ ప్రభాకర్ యు రమేష్ ,రఘు,రాజేశ్వర్ డిటిఎఫ్ నాయకులు షేక్ మదర్  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article