రుద్రూర్, బతుకమ్మ :
సద్గురు స్వామి సమర్థ మహారాజ్ (దుబ్బాక) వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయాలల్లో స్వామి వారికి సింధూర అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది యువకులు, స్వామి వారి భక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం హనుమాన్ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, బ్లడ్ ఫౌండర్ సంతోష్, స్వామి వారి భక్తులు వడ్ల నరేష్, రమణ గౌడ్, గుండూరి శ్రీకాంత్ గౌడ్, తెల్ల గోపి, కుమ్మరి గణేష్, వెంకటేష్, శివ, బందెల రాజశేఖర్, దుర్కి సంతోష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
