తిరుమల, బతుకమ్మ : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు మత్స్యకార గ్రామాల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో త్వరలో పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు ప్రణాళికలు చేస్తుంది. వేంకటేశ్వర స్వామి వారి పై ఉన్న రచనలతో పాటు, దేవతా మూర్తుల స్తోత్రాలు, భజనలు కథలు భగవద్గీత పుస్తకాలు దాతల సహకారం అందించే అంశాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలిస్తున్నారు. ముందుగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీటిని అందించనున్నారు.